| నాడు: |
| ఉదయించే లేత సూర్యుని సాక్షిగా... |
| పుస్తకం చేబట్టి చదువుకున్న గుర్తు!! |
| అమ్మ చల్లిన కళ్ళాపు సాక్షిగా.. |
| "ముగ్గులు నే వేస్తా " అని నేర్చుకున్న గుర్తు!! |
| బామ్మ చెప్పిన కథల సాక్షిగా... |
| నీతి నేర్చుకున్న గుర్తు!! |
| తాతయ్య తెచ్చిన బొమ్మల సాక్షిగా... |
| లక్కపిడతల చెలిమి గుర్తు!! |
| సాయం సంధ్య సాక్షిగా... |
| నాన్నతొ కలసి చేసిన పఠనం గుర్తు!! |
| స్నేహితుల సాక్షిగా... |
| ఊరితొ ఉన్న అనుబంధం గుర్తు!! |
| నేడు. |
| మధ్యాహ్న సన్ సాక్షిగా... |
| కార్టూన్ చానల్స్ చూస్తున్న గుర్తు!! |
| అమ్మ వండిన వంట సాక్షిగా... |
| కన్నార్పకుండా అదే కొనసాగిస్తున్న గుర్తు!! |
| బామ్మ తాతల కథలేమో గానీ.. |
| ఇంటెర్నెట్ సాక్షిగా...వాళ్ళను కంప్యుటర్ లో కలుస్తున్న గుర్తు!! |
| స్నేహితుల సాక్షిగా... |
| స్మార్ట్ ఫొన్ లో ఆడుతున్న ఆటలు గుర్తు!! |
పోపులడబ్బా
Tuesday, 1 October 2013
నాడు..నేడు
Subscribe to:
Posts (Atom)