Tuesday, 1 October 2013

నాడు..నేడు

నాడు:
ఉదయించే  లేత సూర్యుని సాక్షిగా...
                  పుస్తకం చేబట్టి చదువుకున్న గుర్తు!!
అమ్మ చల్లిన కళ్ళాపు సాక్షిగా..
                 "ముగ్గులు నే వేస్తా " అని నేర్చుకున్న గుర్తు!!
బామ్మ చెప్పిన కథల సాక్షిగా...
                  నీతి నేర్చుకున్న గుర్తు!!
తాతయ్య తెచ్చిన బొమ్మల సాక్షిగా...
                 లక్కపిడతల చెలిమి గుర్తు!!
సాయం సంధ్య సాక్షిగా...
                    నాన్నతొ కలసి చేసిన పఠనం గుర్తు!!
స్నేహితుల సాక్షిగా...
                ఊరితొ ఉన్న అనుబంధం గుర్తు!!
నేడు.
మధ్యాహ్న సన్ సాక్షిగా...
                 కార్టూన్ చానల్స్ చూస్తున్న గుర్తు!!
అమ్మ వండిన వంట సాక్షిగా...
               కన్నార్పకుండా అదే కొనసాగిస్తున్న గుర్తు!!
బామ్మ తాతల కథలేమో గానీ..
                  ఇంటెర్నెట్ సాక్షిగా...వాళ్ళను కంప్యుటర్ లో కలుస్తున్న గుర్తు!!
స్నేహితుల సాక్షిగా...
                స్మార్ట్ ఫొన్ లో ఆడుతున్న ఆటలు గుర్తు!!

No comments:

Post a Comment